Sumanth: హీరో సుమంత్‌ కొత్త చిత్రం.. మళ్లీ ఆ డెరెక్టర్‌తో రిపీట్‌..

3 Jul, 2022 18:52 IST|Sakshi

Hero Sumanth New Movie With Santhosh Jagarlapudi: హీరో సుమంత్ ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేన్‌లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కె ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం (జులై 3) ప్రకటించారు.

పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్‌కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కె ప్రదీప్ తెలిపారు.

చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌
వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!

మరిన్ని వార్తలు