వ్యాక్సిన్‌ తీసుకున్న హీరో సూర్య దంపతులు

22 Jun, 2021 19:04 IST|Sakshi

హీరో సూర్య ఆయన భార్య, నటి జ్యోతిక వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మంగళవారం(జూన్‌ 22) వారిద్దరూ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘వ్యాక్సినేటెడ్‌’ అంటూ  భార్య జ్యోతిక, సూర్య వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

కాగా సూర్య ఇటీవల నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్‌ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య  స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు