క్రేజీ కాంబినేషన్‌: ఆ డైరెక్టర్‌తో సూర్య నెక్ట్స్‌ మూవీ

14 Aug, 2021 08:03 IST|Sakshi

చెన్నై: నటుడు సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్‌లో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలివుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. నంద చిత్రంతో సూర్యను మాస్‌ హీరోగా మార్చిన దర్శకుడు బాల, ఆ తరువాత విక్రమ్, సూర్య కాంబినేషన్‌లో పితామగన్‌ తీసి సంచలన విజయాన్ని సాధించారు. కాగా బాలాతో సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అధర్వ, కీర్తి సురేష్‌ జంటగా నటిస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు