‘జార్జియా’కు పయనమైన హీరో విజయ్‌

8 Apr, 2021 08:18 IST|Sakshi

జార్జియా ట్రిప్‌ ప్లాన్‌  చేశారు హీరో విజయ్‌. ‘డాక్టర్‌’ ఫేమ్‌ నెల్సన్‌  దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ జార్జియాలో ప్రారంభం కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొనేందుకే విజయ్‌ జార్జీయా ప్రయాణం అయ్యారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌  సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్న్‌ దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు.  

చదవండి: 
ఓటు వేసిన హీరో విజయ్‌.. బిల్డప్‌ అంటూ ట్రోల్స్‌
విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్న బుట్ట బొమ్మ!

మరిన్ని వార్తలు