వివేక్‌ కుటుంబానికి  విజయ్‌ పరామర్శ 

27 Apr, 2021 08:14 IST|Sakshi
వివేక్‌తో విజయ్‌ ముచ్చట్లు (ఫైల్‌)

చెన్నై: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కుటుంబాన్ని నటుడు విజయ్‌ పరామర్శించారు. చిరునవ్వే ఆభరణంగా చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న నటుడు వివేక్‌. అలాంటి  పేరున్న నటుడు ఈ నెల 17వ తేదీ ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వివేక్‌ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా నటుడు విజయ్‌ ఆ సమయంలో జార్జియాలో చిత్రీకరణ జరుగుతున్న తన  65 చిత్ర షూటింగ్లో ఉన్నారు. వివేక్‌ మరణ వార్త తెలిసినా కరోనా నిబంధనల కారణంగా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేని పరిస్థితి. విజయ్‌ ఆరంభకాలం నుంచి వివేక్‌ ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు.

చివరిగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన బిగిల్‌ చిత్రంలో వివేక్‌ కీలక పాత్రను పోషించారు. కాగా జార్జియాలో షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆదివారం చెన్నై చేరుకున్న విజయ్‌ సోమవారం ఉదయం వివేక్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
చదవండి: ‘బ్లాక్‌’ క్యారెక్టర్‌ లీడ్‌గా సాగిన చిత్రం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు