అభిమన్యుడు, చక్ర సినిమాలకు సంబంధం లేదు

19 Feb, 2021 10:05 IST|Sakshi

‘‘చక్ర’ సినిమాలో హీరో ఫాదర్‌కి కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ఇస్తుంది.. కొంత మంది దుండగులు దాన్ని దొంగలిస్తారు. ఇండియన్‌ ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు? అనే కథాంశంతో  ఈ సినిమా ఉంటుంది. అందుకే ‘చక్ర’ టైటిల్‌ పెట్టాం’’ అని హీరో విశాల్‌ అన్నారు. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా రెజీనా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘చక్ర’. విశాల్‌ నటించి, నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ– ‘‘చక్ర’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజువల్స్‌ చూస్తుంటే ‘అభిమన్యుడు’ సినిమాలాగా అనిపిస్తుంది.. కానీ రెండిటికీ సంబంధం లేదు. ఆనందన్‌ కథ చెబుతున్నప్పుడే విజిల్స్‌ వేయాలనిపించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిది. యువన్‌ శంకర్‌రాజాతో నా 10వ సినిమా ‘చక్ర’. నా తర్వాతి రెండు చిత్రాలకు కూడా అతనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం ఆర్యతో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమా చేస్తున్నాను. నా డైరెక్షన్‌లో ‘అభిమన్యుడు–2’ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత శరవణన్‌ అనే ఒక షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తా’’ అన్నారు.

చదవండి: హీరో విలన్‌, విలన్‌ హీరో అయ్యాడు

స్టార్‌ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్‌!

మరిన్ని వార్తలు