హీరో విశాల్ తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే!

16 Sep, 2020 11:19 IST|Sakshi

చెన్నై: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న హీరో విశాల్‌ తండ్రి జీకే రెడ్డి తన ఆరోగ్య సహస్యం వెల్లడించారు. 82 ఏళ్ల వయసులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఆరోగ్యానికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఎక్సర్‌సైజుల వల్ల శారీరకంగా ధృడంగా తయారవ్వొచ్చని అన్నారు. వ్యాయామానికి సంబంధించి ఆయన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

అభిమానులు, నెటిజన్లు జీకే రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 82 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారు. మీ కృషి అభినందనీయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, జీకే రెడ్డికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విశాల్‌ దగ్గరుండి సపర్యలు చేశాడు. ఆ క్రమంలోనే తనూ వైరస్‌ బారినపడ్డాడు. డాక్టర్ల సలహాలు, మనోధైర్యంతో ఇద్దరూ వైరస్‌పై విజయం సాధించారు. ఇదిలాఉండగా.. జీకే గ్రానైట్స్‌ కంపెనీ అధినేత అయిన జీకే రెడ్డి.. జీకే ఫిట్‌ అనే సంస్థను స్థాపించారు. దానిద్వారా వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు.
(చదవండి: బీజేపీలోకి హీరో విశాల్‌?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు