ఆర్బీ చౌదరిపై హీరో విశాల్​ ఫిర్యాదు

10 Jun, 2021 13:26 IST|Sakshi

చెన్నై: సూపర్ గుడ్ ఫిల్మ్స్​ ప్రొడక్షన్​ హౌజ్​ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 

2018లో ఇరుంబుతిరమ్​(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్​ తన ఓన్ బ్యానర్​ విశాల్​ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో  విశాల్​, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తాకట్టు పెట్టాడు. ఇక అప్పు మొత్తం తీర్చినప్పటికీ తన పత్రాలు ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తూ విశాల్​ ఇప్పుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


 
కాగా, ఈ వ్యవహారం కోలీవుడ్​లో హాట్ టాపిక్​గా మారింది.  ప్రస్తుతం విశాల్​ ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్​ బ్యానర్​పై తెలుగు, తమిళ్​, మలయాళంలో సినిమాలు తీశాడు. ఆయన కొడుకులు జీవా, జతిన్ రమేశ్​ ఇద్దరూ హీరోలే.

చదవండి: విశాల్​.. భగత్​ సింగ్​ను తలపించావ్​

మరిన్ని వార్తలు