Hero Vishal Injured: షూటింగ్‌లో ప్రమాదం.. మరోసారి హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

11 Aug, 2022 10:17 IST|Sakshi

సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రిస్క్‌ చేసే హీరోల్లో విశాల్‌ ఒకరు. పోరాట సన్నివేశాల కోసం డూప్ లేకుండా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఎంత సహజంగా చిత్రీకరిస్తే సినిమాకు అంత ప్లస్‌ అవుతుందని నమ్మే హీరో విశాల్‌. ఈ క్రమంలో విశాల్‌ పలుమార్లు షూటింగ్‌లో  గాయపడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్‌గా లాఠీ సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్‌ కొన్నిసార్లు ప్రమాదానికి గురైన గురయ్యాడు. మరోసారి ఆయన తాజా చిత్రం షూటింగ్‌లో విశాల్‌కు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. 

చదవండి: 'బిగ్‌బాస్‌-6' కోసం నాగార్జున అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

ఇటివలే లాఠి మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్ను విశాల్‌ ప్రస్తుతం మార్క్‌ ఆంటోనీ మూవీతో బిజీగా ఉన్నాడు. నేడు గురువారం ఉదయం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న విశాల్‌ భారీ యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో విశాల్‌ తీవ్రంగా గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. గాయపడ్డ విశాల్‌ ప్రథమ చికిత్స అనంతరం షూటింగ్‌ నుంచి వెళ్లిపోయాడని, కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకొనున్నాడని సమాచారం. 

మరిన్ని వార్తలు