క్రిష్‌ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట!

5 May, 2021 18:59 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి ఆయన భార్య రమ్యతో విడిపోయి మూడేళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆయన విడాకులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. కాగా రమ్య అనే డాక్టర్‌ను 2016 అగష్టు 7న వివాహం చేసుకున్న క్రిష్ ఆ తర్వాత రెండేళ్లకే ఆమెతో విడిపోయాడు. లేటు వయసులో వివాహం చేసుకున్న ఆయన అతి తక్కువ సమయంలో భార్యతో విడిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

దీంతో అప్పట్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే క్రిష్‌.. భార్య రమ్యతో విడిపోవడానికి ఓ హీరోయిన్‌ కారణమట. ఆయన డైరెక్షన్‌లో నటించిన ఓ హీరోయిన్‌తో క్రిష్‌ క్లోజ్‌గా ఉండేవాడట, అది నచ్చని భార్య రమ్య ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

దీంతో ఇద్దరూ కలిసి విడిపోవాలని నిర్ణయించుకుని 2018లో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం, విడిపోవడం చకచక జరిగిపోయింది. అయితే క్రిష్‌తో చనువుగా ఉన్న ఆ హీరోయిన్‌ ఎవరూ, ఏ మూవీ డైరెక్షన్‌ సమయంలో ఇలా జరింగిందనేది ఇప్పటికి స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం క్రిష్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: 
పోరాటానికి ‘వీరమల్లు’ కసరత్తు, ఫొటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు