హీరోయిన్‌ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే..‌

8 Apr, 2021 19:07 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. సినీ ఇండస్ర్టీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్‌ సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్‌ అంజలి కూడా చేరిందని, ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా అంజలి వకీల్‌సాబ్‌ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్‌కు ఇటీవలె కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అంజలికి సైతం కరోనా సోకిందని పలు వార్తలు గుప్పుమన్నాయి.


ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు రూమర్స్‌ వినిపించాయి. దీనిపై అంజలి సైతం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇదంతా నిజమే అనుకొని అంజలికి కరోనా సోకిందనే వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతుండటంతో నటి అంజలి క్లారిటీ ఇచ్చారు. 'నాకు కరోనా వచ్చిదంటూ పలు న్యూస్‌ ఆర్టికల్స్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాకు కరోనా సోకిందనే వార్త పూర్తి అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కోవిడ్‌ రాలేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ నెటిజన్లను కోరింది. 

చదవండి : బ్రేకప్‌ తట్టుకోవడం చాలా కష్టం: అంజలి
టీకా‌ తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు