'అనుపమకు బోర్‌ కొడితే ఇలాగే జరుగుతుంది' .. వీడియో వైరల్‌

6 Jul, 2021 14:23 IST|Sakshi

కేరళ కుట్టి అనుమప పరమేశ్వరన్‌ అందం,అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో అనుపమ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనుమప చేసిన డబ్స్‌ మాష్‌, రీల్స్‌ మిలయన్ వ్యూస్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడయాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేసింది. తనకు బోర్‌ కొడితే పక్కన వాళ్లు బలవ్వాల్సిందేనంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో అనుమప తమ్ముడు ఏదో రాస్తూ తన పనిలో ఉండగా, అనుమప అతని తలపై ఒకదాని తర్వాత ఒక దిండును పేర్చుతూ పోతుంది. అవి కింద పడటంతో మళ్లీ అదే పని చేస్తూ బాగా ఇరిటేట్‌ చేస్తుంటుంది.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే..అనుపమ ప్రస్తుతం నిఖిల్‌ సరసన 18 పేజేస్‌ అనే మూవీలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్‌ సమయంలో కూడా అనుమప చేసే అల్లరి మామూలుగా ఉండదు. యూనిట్‌ అంతా షూటింగ్‌ కోసం సీరియస్‌గా వర్క్‌ చేస్తుంటే.. అనుపమ మాత్రం సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ వీడియోను నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు