ఆ టాప్‌ మోస్ట్‌ ఉద్యోగికి కూడా అంత శాలరీ ఉండదేమో..

7 Jul, 2021 16:55 IST|Sakshi

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణెకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. 'ఓం శాంతి ఓం' అనే చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపిక తొలి చిత్రంతోనే స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో అగ్ర స్థానానికి చేరుకుంది. దీంతో దేశ వ్యాప్తంగానే కాక ప్రపం​చ వ్యాప్తంగా ఈ అమ్మడికి అభిమానులున్నారు. ఇక సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు..ఇలా ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. దీంతో దీపిక కాలు బయటపెట్టాంటే బాడీగార్డ్‌ ఉండాల్సిందే. మరి దీపికకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ నేపథ్యంలో ఆమె బాడీగార్డ్‌ ఎవరు? అతనికి ఎంత జీతం ఇస్తారు అన్న విషయాలపై ఆరా తీయగా ఓ షాకింగ్‌ విషయం బయటపడింది.

ఆమె పర్సనల్‌ బాడీగార్డ్‌ పేరు జలాల్‌. దీపిక ఎక్కడ ఔట్‌డోర్స్‌కి వెళ్లినా జలాల్‌ దీపిక వెంట ఉండాల్సిందేనట. కొన్ని సంవత్సరాలుగా దీపికను కాపాడుకుంటూ వస్తున్న జలాల్‌ జీతం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే  అతను నెలకి అక్షరాలా 6.5 లక్షల రూపాయలు జీతంగా అందుకుంటున్నాడు. అంటే ఈ లెక్కన ఏడాదికి 80 లక్షల వరకు వస్తుందట. ఓ  ఎమ్‌ఎన్‌సి కంపెనీలో పనిచేసే టాప్ గ్రేడ్ ఎంప్లొయ్ కి కూడా బహుశా ఇంత శాలరీ ఉండదమో అనిపించేలా దీపిక బాడీగార్డ్‌కు లక్షల్లో  నెలవారీ జీతం వస్తుందట. 

ఇది కాకుండా పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో దీపిక నుంచి జలాల్‌ కుటుంబానికి ప్రత్యేకమైన బహుమతులు కూడా వెళ్తుంటాయట. అంతేకాకుండా దీపిక జలాల్‌ను సొంత సోదరుడిలా భావిస్తుందని, ప్రతీ ఏడాది రాఖీ కూడా కడుతుందని సమాచారం. రణ్‌వీర్‌-దీపికల పెళ్లి వేడకలోనూ జలాల్‌ సెక్యూరిటీ హెడ్‌గా విధులు నిర్వర్తించినట్లు బీటౌన్‌ టాక్‌. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం దీపిక భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘83’ బయోపిక్‌లో నటించింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ సినిమాకు కూడా దీపిక సైన్‌ చేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు