ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..

28 Jul, 2021 07:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక  దుషారా విజయన్‌. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్‌ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్‌ డిజైనింగ్‌ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను.

ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్‌ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్‌కాల్‌ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్‌ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్‌లో సెలెక్ట్‌ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు