తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ హీరోతో సినిమా?

21 Apr, 2021 15:55 IST|Sakshi

హ‌..హ‌..హాసిని అంటూ తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నటి జెనీలియా. బొమ్మరిల్లు సినిమాతో బంపర్‌హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది. భర్త రితేష్‌తో కలిసి పలు ఫన్నీ వీడియోలు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే ట్యాగ్‌ లైన్‌ను దక్కించుకుంది ఈ జంట. 

తాజాగా టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమైందట ఈ భామ. యంగ్‌ హీరో రామ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెడీ సినిమా బంపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ జోడీకి యూత్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు జెనీలియా రీ ఎంటట్రీ వార్తలతో ఆమె ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి : నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
రష్మికకు ప్రపోజ్‌ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు