కాజల్‌ అగర్వాల్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

26 Jun, 2021 11:42 IST|Sakshi

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా ఫుల్‌ బిజీగా మారింది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ను కూడా పక్కాగా ప్లాన్‌ చేస్తుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది.లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌ తెరపై మెరిసిన  కాజల్‌ నేటికీ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది.  దక్షిణాదిన దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌.. యంగ్‌ హీరోలతోనూ ఆడిపాడింది.


మోడల్‌గా అడుగుపెట్టిన కాజల్‌ అగర్వాల్‌ తొలుత క్యూను హో గయానా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం మూవీలో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.  తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రం కాజల్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో తొలి చిత్రం లక్ష్మి కళ్యాణం మూవీతోనే 23 లక్షల రెమ్యునరేషన్‌ అందుకుంది కాజల్. ఇటీవలె మంచు విష్ణతో చేసిన మోసగాళ్లు చిత్రానికి గాను అత్యధిక రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు తీసుకుంటుందట. 


ప్రస్తుతం ముంబైలో ఓ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్న కాజల్‌ తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించిందట. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్ల వరకు ఆస్తులను కూడగట్టిందని సమాచారం. అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నా తనవంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది ఈ పంచదార బొమ్మ.  ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌-2’లో నటిస్తుంది. వీటితో పాటు  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

చదవండి : డబ్బులిచ్చి మరీ హెయిర్‌ స్టయిలింగ్‌ చేసేదాన్ని: కాజల్‌
కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’!


 

మరిన్ని వార్తలు