Krithi Shetty Crying: లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి..

30 May, 2022 13:42 IST|Sakshi

Heroine Krithi Shetty Crying In Live Interview: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్‌ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలో ఏడ్చేసింది బేబమ్మ.

చదవండి: బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్‌ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

A post shared by 𝗞𝗿𝗶𝘁𝗵𝗶 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 🔵 (@krithi.shetty_shines)

మరిన్ని వార్తలు