తనకున్న కోరికలేంటో చెప్పేసిన కృతి సనన్‌

9 Apr, 2021 19:25 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సరసన ‘1: నేనొక్కడినే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. అయితే తెలుగులో ఈ భామకు సరైన హిట్‌ లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్‌ అందుకుంది. అప్పట్నుంచి  హిందీ చిత్రాలకే పరిమితమైన ఈ భామ..ఆ తర్వాత వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం 7 భారీ బడ్జెట్‌ చిత్రాలతో గత కొన్ని నెలలుగా ఫుల్‌ బిజీగా ఉంది కృతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ..తనకున్న మూడు కోరికలను బయటపెట్టేసింది.

అందులో మొదటిది..ఓ పెద్ద ఇళ్లు..అక్కడే పెద్ద గార్డెన్‌లో కూర్చొని హాయిగా టీ తాగుతూ సేదతీరాలి. రెండోది స్కై డేవింగ్, ఇక మూడోది నేషనల్‌ అవార్డ్‌ని అందుకోవాలి అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఈ కోరికలు త్వరగా నెరవాలని కోరుకుంటున్నానని  కృతి పేర్కొంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘అదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృతి చేతిలో ప్రస్తుతం 7 సినిమాలు ఉ‍న్నాయి. దీంతో కరోనా రాకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ భామ. 

చదవండి : పుష్ప టీజర్‌పై కాంట్రవర్సీ..'కాపీ' అంటూ నెటిజన్లు ఫైర్
నటితో బిగ్‌బాస్‌ విన్నర్‌ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు