ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభిస్తున్న నటి నమిత

6 May, 2021 07:55 IST|Sakshi

నటి నమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను చిదిమేస్తోంది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు రద్దయ్యాయి. ఇదిలా జరగడం రెండోసారి. సినిమాల విడుదల చాలా వరకు వాయిదా పడుతున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వైపు దృష్టిసారిస్తున్నారు. అలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు లాభసాటిగా మారాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గిరాకీ పెరగడంతో కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. తాజాగా నటి నమిత కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ఆమె రవివర్మ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి ప్రారంభిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌ నమిత టాకీస్‌ అని పేరు నిర్ణయించారు. దీని గురించి నమిత బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఓటీటీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 
చదవండి: ప్యాలెస్‌లో రాఖీ భాయ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు