రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో న‌య‌న్ వెన‌క్కు త‌గ్గుతుందా?

26 Apr, 2021 15:06 IST|Sakshi

అమ్మ‌ప్రేమ‌లోని గొప్ప‌త‌నాన్ని అడుగ‌డుగునా చాటిచెప్పిన చిత్రం మాతృదేవోభవ‌. 1993లో విడుద‌లైన ఈ చిత్రం ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అమ్మ‌ప్రేమ‌లోని మాధుర్యాన్ని అంతలా క‌నెక్ట్ చేసిన చిత్ర‌మిది. కె. అజయ్‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాజ‌ర్‌, మాధ‌వి న‌టించిన ఈ చిత్రాన్ని కె.ఎస్‌. రామారావు నిర్మించారు‌.  తాజాగా చిత్ర నిర్మాత రామారావు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. త‌న‌కు మాతృదేవోభవ రీమేక్ చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజ‌య్ కుమారే ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌కత్వం వ‌హించాల‌ని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ పాత్ర‌లో ఎవ‌రు న‌టించాల‌నే ప్ర‌శ్న‌కు బ‌దులుగా..న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ఇద్ద‌రూ ఈ పాత్ర‌కు స‌రిపోతార‌ని, న‌య‌న‌తార న‌ట‌న ఇంకాస్త మెచ్యూర్డ్ కూడా ఉంటుంద‌ని, ఆమె అయితే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడున్న న‌టీన‌టులు క‌థ కంటే రెమ్యూన‌రేష‌న్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, వాళ్లు అడిగే రెమ్యూన‌రేష‌న్ వింటేనే కంగారు ఉంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి చిన్న పాత్రకు సైతం భారీ పారితోషికం అందుకునే న‌య‌న‌తార ఈ సినిమాను చేస్తోందా?  లేక క‌థ‌కు ప్రాధాన్య‌మిచ్చి రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో కాస్త వెన‌క్కు త‌గ్గుతుందా అన్న‌ది తెలియాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది

చ‌ద‌వండి :
పుష్ప: ఆ రోల్ చేయ‌డానికి ఐశ్వ‌ర్య‌ ఒప్పుకుంటుందా?

సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు

మరిన్ని వార్తలు