వ్యాక్సిన్‌ వేయించుకున్న పాయల్‌.. ఈసారి ఏం చేసిందంటే..

6 May, 2021 19:23 IST|Sakshi

హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ ఫోటోలను షేర్‌ చేసింది. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత తేలికపాటి జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరింది. అంతేకాకుండా వ్యాక్సి్‌కు ముందు మంచి, నిద్రతో పాటు శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గతంలో ఓ సినిమా షూటింగులో పాల్గొన్న పాయల్‌ కరోనా టెస్టు చేయించుకునే సమయంలో గట్టిగా అరుస్తూ, కేకలు పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా వ్యాక్సిన్‌ తీసుకున్న నేపథ్యంలో మరోసారి ఈ  వీడియో నెట్టింట వైరలవుతోంది. టెస్టుకే భయపడిపోయిన పాయల్‌ ఇక వ్యాక్సిన్‌ తీసుకునే టైంలో చుక్కలు చూపించి ఉంటుందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్‌ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ తర్వాత వెంకటేష్‌తో వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజా వంటి సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న పాయల్‌ అందులో నెగిటివ్‌ షేడ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆహాలో త్వరలోనే ఈ సిరీస్‌ స్ర్టీమింగ్‌ కానున్నట్లు సమాచారం. 

చదవండి : కరోనాతో 'చిచోరే' నటి మృతి
లాక్‌డౌన్‌.. వలస కూలీల కడుపు నింపుతున్న సన్నీలియోన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు