ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్‌.. ఏం చేసిందంటే..

7 May, 2021 08:30 IST|Sakshi

‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇది వరకు కొంచెం బొద్దుగా ఉండేది. కానీ తాజాగా బరువు తగ్గి సన్నజాజిలా మారిపోయింది. కేవలం ఒక్క నెలలోనే 6కేజీల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం తనకిష్టమైన ఫుడ్‌ను సైతం పక్కన పెట్టిందట. తాను నటిస్తున్న ఓ సినిమా కోసం బరువు తగ్గినట్లు పేర్కొంది. సినిమాలో తనది పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయి పాత్ర అని, ఇందుకోసం బరువు తగ్గాల్సి వచ్చిందని ,అయితే పాత్ర కోసం ఇలా వెయిట్‌లాస్‌ అవ్వడం ఇదే తొలిసారి అని వివరణ ఇ‍చ్చింది. అంతేకాకుండా తాను ఎలా బరువు తగ్గిందో కూడా అభిమానులతో పంచుకుంది.

'డైట్‌ విషయంలో చాలా కఠినంగా  ఉన్నాను. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 మధ్య మాత్రమే ఆహారం తీసుకున్నా. దీంతో పాటు వారంలో కొన్ని రోజులు ఉపవాసం , యోగా, వ్యాయామాలు చేసేదాన్ని.అలా కేవలం నెల రోజు వ్యవధిలోనే 6కిలోలు తగ్గాను' అని పేర్కొంది. ఇక తన లేటెస్ట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా మెరుపుతీగలా మారిపోయిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ క్యారెక్టర్‌ కోసం పాయల్‌ చూపించిన డెడికేషన్‌కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

ఇక తెలుగులో ఈ అమ్మడికి అంతగా కలిసి రాకపోయినా తన మాతృభాష బెంగాలీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. వెంకీమామ, డిస్కో రాజా వంటి హిట్‌ సినిమాల్లో నటించినా పాయల్‌కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ ఆమ ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో నెగిటివ్‌ షేడ్‌లో కనపించనుందట. తెలుగులో తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లో కూడా పాయల్‌ది నెగిటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టరే. దీంతో మరోసారి ఈ ఫార్ములా వర్కవుట్‌ అవుతుందేమో అని భావిస్తుందట. 

చదవండి : వ్యాక్సిన్‌ వేయించుకున్న పాయల్‌.. ఈసారి ఏం చేసిందంటే..
'ప్లీజ్‌ పాయల్‌ నెంబర్‌ చెప్పండి', హీరోయిన్‌ ఆన్సర్‌ ఇదే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు