కూతురితో అందాల భామ ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

8 Nov, 2022 16:33 IST|Sakshi

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ ప్రణీత సుభాష్‌. ఆ తర్వాత అత్తారింటికీ దారేది సినిమాతో ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాందించారు. టాలీవుడ్‌తో కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ సుందరి 2021లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.  బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహమాడింది. 

కొద్ది నెలల క్రితమే ప్రణీత సుభాష్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఇప్పటి వరకు  ఈమె తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడా కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో కూతురితో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్నారు. మొదటిసారి తన కూతురి ముఖాన్ని చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రణీత తన ఇన్‌స్టాలో రాస్తూ..'వారాంతాల్లో పేరెంటింగ్ హ్యాక్. ఇక నుంచి నా వారాంతాల్లో ఇలాగే ఉంటుంది' అంటూ లవ్ ఏమోజీని జతచేసింది. 

దీంతో పాప ఫోటోలు చూసిన ఆమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. వావ్.. ఎంత ముద్దుగా ఉందో అంటూ రిప్లై ఇస్తున్నారు. పాప కూడా అచ్చు ప్రణీత లాగే ఉందంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. మరికొందరేమో ఏకంగా అందంలో ఇద్దరు పోటీ పడుతున్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులకు దగ్గరవుతున్నారు. 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

మరిన్ని వార్తలు