ఆటో డ్రైవర్‌కు సమంత ఊహించని గిఫ్ట్‌‌

17 Apr, 2021 10:58 IST|Sakshi

ఆటో డ్రైవర్‌ కవితకు స్విఫ్ట్‌ డిజైర్‌ కారు అందజేత

మనూరు (నారాయణఖేడ్‌): సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు ప్రముఖ నటి సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కవిత.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు స్విఫ్ట్‌ డిజైర్‌ కారును అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్‌ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం అందింది. ఈమె జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు.. యూ ట్యూబ్‌లో పోస్టు చేశారు. అది చూసిన సమంత తనకు ఇలా గిఫ్ట్‌ ఇచ్చారని కవిత సంబర పడుతోంది.

డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన కవితకు బాల్య వివాహం జరిగింది. భర్త రోజు తాగొచ్చి కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చింది. అక్కడ పొలం పనులకు వెళ్తూ ఏగుడురి చెల్లెళ్లను పోషించింది. తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో  ఆటో డ్రైవింగ్‌ నేర్చుకొని హైదరాబాద్‌కి వచ్చింది. మీయాపూర్‌ టూ బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది.

చదవండి:
రామ్‌ చరణ్‌ మూవీ: జర్నలిస్టుగా రష్మిక!

ఆయన క్యాచ్‌ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు