లైవ్‌లో నీ వయసు అదేనా అని అడిగిన నెటిజన్‌, హీరోయిన్‌ కౌంటర్‌

4 Jun, 2021 21:04 IST|Sakshi

‘చూసి చూడంగానే..’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది నటి వర్ష బొల్లమ్మ. ఈ మూవీ అంతగా సక్సెస్‌ సాధించకపోయినప్పటికి ఇందులో తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’ మూవీలో నటించే చాన్స్‌ కొట్టెసింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే వర్ష 2015లో తమిళంలో వచ్చిన సతురన్‌ మూవీతో నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగులో నటించే అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ సౌత్‌లో బిజీ అయిపోయిన ఈ భామ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు ఆస్క్‌మీ ఏనిథీంగ్‌ పేరుతో లైవ్‌లో సెషన్‌ నిర్వహించి తరచూ అభిమానులతో ముచ్చటిస్తు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా లైవ్‌ చిట్‌చాట్‌కు వచ్చిన ఆమె.. ఓ నెటిజన్‌ అడిగిన కొంటే ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చింది. ‘మీకు 25 ఏళ్లని గూగుల్‌ చూపిస్తోంది.9అది నిజమేనా?’ అని సదరు అభిమాని ప్రశ్నించాడు.  వెంటనే వర్ష.. ‘వెరైటీ ఎక్స్ ప్రెషన్స్‌తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నేను మామూలుగా అయితే 1996లో పుట్టాను. అయితే నాకిప్పుడు 24 ఏళ్లు ఉండాలి కానీ.. నాకు తెలిసి ఈ విషయం మా అమ్మ కంటే గూగుల్‌కే ఎక్కువ తెలిసి ఉండాలి’ అంటు ఆమె సమాధానం ఇచ్చింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు