స్వయంవరానికి అర్హులు.. కానీ 

11 Sep, 2020 18:22 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): హీరోయిన్‌లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాల రాణులు.. అభిమానుల కలల దేవతలు.. వారితో స్నేహం కోసం ఎందరో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక వివాహం విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మలకు స్వయంవరం పెడితే రాకుమారులు సైతం క్యూ కడతారు. అయితే విచిత్రంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెండో భార్యగా వెళ్లి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. స్మితా పాటిల్‌ మొదలు కరీనా వరకు చాలా మంది హీరోయిన్‌లు విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఓ సారి ఆ జాబితా చూడండి..

1. స్మితా పాటిల్‌
1970 దశకంలో తన అందం, అభినయంతో సినీ లోకాన్ని ఏలిన స్మితా పాటిల్‌ వివాహం విషయంలో మాత్రం ప్రేక్షకులను ఒకింత షాక్‌కు గురి చేశారు. అడిగితే ప్రాణాలర్పించే అభిమానులున్న స్మిత అనూహ్యంగా అలనాటి హీరో రాజ్‌ బబ్బర్‌ని వివాహం చేసుకున్నారు. ఆయనకు అప్పటికే నాదిరా అనే మహిళతో వివాహం అయ్యింది. కానీ స్మిత పరిచయం తర్వాత రాజ్‌ బబ్బర్‌ ఆమెకు విడాకులు ఇచ్చి.. స్మితను వివాహం చేసుకున్నారు. 

2. షబానా అజ్మీ
హీరోయిన్‌ అంటే కేవలం ఓ అందాల బొమ్మ అనుకునే ఇండస్ట్రీలో తన అభినయంతో టాప్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షబానా అజ్మీ. ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్టు గెలుచుకున్నారు. నటిగానే కాక సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. అయితే షబానా అజ్మీ కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ కవి జావేద్‌ అఖ్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే ఆయన హనీ ఇరానీ అనే ఆమెను వివాహం చేసుకోవడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (చదవండి: భలే ఉన్నావు బాబు)

3. శ్రీదేవి
ఇక అందాల తార, లేడీ సూపర్‌ స్టార్‌ శ్రీదేవికి అంతర్జాతీయంగా క్రేజ్‌. బాల్యం నుంచి సినిమాల్లోనే ఉన్న శ్రీదేవి.. ఎందరికో కలల రాకుమారి. చాలా మంది హీరల ఫస్ట్‌ క్రష్‌ కూడా అతిలోక సుందరి మీదనే. స్వయం వరం ప్రకటిస్తే.. దేశవిదేశాల బడా బాబులు.. వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు శ్రీదేవి కోసం క్యూ కట్టేవారు అంటే ఆశ్చర్యం లేదు. అంతటి క్రేజ్‌ ఉన్న ఈ నటి.. నిర్మాత బోని కపూర్‌ని వివాహం చేసుకుని ప్రపంచానికి పెద్ద షాక్‌ ఇచ్చారు. అది కూడా రెండో భార్యగా వెళ్లారు. వర్మ లాంటి చాలా మంది నేటికి ఈ నిజాన్ని జీర్ణించుకోలకపోతున్నారు. శ్రీదేవి కంటే ముందే బోని కపూర్‌కి మోనా కపూర్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి విడాకులు ఇచ్చి.. శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాహ్నవి, ఖుషి అని ఇద్దరు సంతానం. (చదవండి: నా కథ చెబుతాను)

4. సారిక
సారిక కూడా విడాకుల తీసుకున్నవ్యక్తినే పెళ్లాడారు. లోక నాయకుడు కమల్‌ హాసన్‌‌ జీవితంలో రెండో భార్యగా ప్రవేశించారు. కమల్‌ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చి.. సారికను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రుతి హాసన్‌, అక్షరా హాసన్‌. ఆ తర్వాత సారిక కమల్‌ నుంచి విడిపోయింది. అది వేరే కథ.

5. మన్యాత దత్‌
మన్యాత దత్‌ ఏకంగా మూడో భార్యగా మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌ జీవితంలో ప్రవేశించారు. మన్యాత కన్నా ముందు సంజయ్‌ రిచా శర్మ, రియా పిల్లయ్‌ అనే ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 

6. కరిష్మ, కరీనా
అక్కాచెళ్లల్లు ఇద్దరు విడాకులు తీసుకున్న వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. అభిషేక్‌ బచ్చన్‌, కరిష్మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కరిష్మా సంజీవ్‌ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే అతడు నందిత మహతానీని వివాహం చేసుకున్నాడు. 

ఇక కరీనా.. చోటా నవాబ్‌ సైఫ్‌ అలీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు సారా, ఇబ్రహీం ఉన్నారు. అమృతతో విడాకుల అనంతరం సైఫ్‌, కరీనాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి తైమూర్‌ అనే బాబు ఉండగా.. రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: తగ్గాలమ్మాయ్‌ అన్నారు!)

7. విద్యా బాలన్‌
బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ యాక్టర్‌ విద్యా బాలన్‌. లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ఇక వివాహం విషయానికి వస్తే.. విద్యాబాలన్‌ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తినే వివాహం చేసుకున్నారు. యూటీవీ హెడ్‌ సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ని పెళ్లాడారు. అయితే అతనికి ఇది మూడవ వివాహం కావడం గమనార్హం.

8. శిల్పా శెట్టి
ఇక పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా కంటే ముందే రాజ్‌ కుంద్రాకు కవిత అనే మహిళతో వివాహం అయ్యింది. ఆమెకు విడాకులు ఇచ్చి.. శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికో కుమారుడు ఉండగా.. తాజగా సరోగసి ద్వారా మరో ఆడబిడ్డ వీరి కుటుంబంలో ప్రవేశించింది.

ఇక వీరే కాక లారా దత్త(మహేభట్‌), కిరణ్‌ రావ్‌(అమీర్‌ ఖాన్‌), కల్కి కోచ్లిన్ (అనురాగ్ కశ్యప్), అమృత అరోరా (షకీల్ లడఖ్) విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఇక మన టాలీవుడ్‌లో అయితే విజయ నిర్మల, అమల, రాధిక వంటి వారు వివాహం అయిన వ్యక్తులను పెళ్లాడారు. మన హీరోల విషయానికి వస్తే.. సీనియర్‌ ఎన్టీఆర్‌, కృష్ణ, నాగార్జున, శరత్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, శరత్‌ కుమార్‌, హరికృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ వంటి వారు కూడా రెండో వివాహం చేసుకున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా