యాక్షన్‌ థ్రిల్లర్‌

14 Nov, 2022 01:29 IST|Sakshi
అశ్విన్

అశ్విన్, నందితా శ్వేత జంటగా అనీల్‌ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హిడింబ’. శ్రీ విఘ్నేశ్‌ కార్తీక్‌ సినిమాస్‌ బ్యానర్‌పై శ్రీధర్‌ గంగపట్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఒక షాకింగ్‌ పాయింట్‌తో డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిడింబ’.

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్సులు ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి. ఈ సినిమా కోసం అశ్విన్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. ఇప్పటికే విడుదలైన మా చిత్రం ఫస్ట్‌ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. మకరంద్‌ దేశ్‌పాండే, సిజ్జు, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస రెడ్డి, ‘శుభలేఖ’ సుధాకర్, రఘు కుంచె ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: వికాస్‌ బడిసా. 

మరిన్ని వార్తలు