ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే కథే ‘హిడింబ’

18 Jul, 2023 03:22 IST|Sakshi

‘‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రం ‘హిడింబ’. స్క్రీన్‌ప్లే, విజువల్స్‌ రెగ్యులర్‌గా కాకుండా మా మూవీలో కొత్తగా ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అని హీరో అశ్విన్‌ బాబు అన్నారు. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్‌ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం ‘హిడింబ’ రివర్స్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. అనిల్‌ కన్నెగంటి మాట్లాడుతూ– ‘‘ఒక చరిత్ర వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘హిడింబ’. నాకు గొప్ప తృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా సినిమాని థియేటర్‌లో చూసి మమ్మల్ని సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు గంగపట్నం శ్రీధర్‌. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస్‌ రెడ్డి, రఘు కుంచె పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు