Allu Arjun In BB15: బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్న అల్లు అర్జున్‌!

28 Nov, 2021 19:19 IST|Sakshi

Allu Arjun To Enter Bigg Boss House: టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్‌తో మరింత బిజీ అవనున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నాడట!

సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో బన్నీ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ బిగ్‌బాస్‌ షోలో అడుగుపెడుతున్నాడట! ​​కాగా బన్నీ, సల్మాన్‌ ఖాన్‌లకు ఇదివరకే పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం(డీజే)లోని సీటీమార్‌ సాంగ్‌ సల్మాన్‌ రాధే మూవీలో వాడారు. ఈ పాట వాడుకోనిచ్చినందుకు సల్లూ భాయ్‌ బన్నీకి థ్యాంక్స్‌ చెప్పడంతో పాటు మీ స్టెప్పులు అదిరిపోయానని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. మీ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం సంతోషమంటూ బన్నీ కూడా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇదిలా వుంటే బన్నీ హిందీలో మల్టీస్టారర్‌ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని, ఇందులో అల్లు అర్జున్‌తో పాటు హీరో షాహిద్‌ కపూర్‌ నటించనున్నారని ఓ వార్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు