బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో చిన్ననాటి ఫోటోను షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌

29 Mar, 2021 14:50 IST|Sakshi

ముంబై : రంగుల హోలీ వస్తుందంటే.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగును జరుపుకుంటారు. కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఈసారి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ స్టార్స్‌ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లాసంగా హోలీని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్ననాటి ఫోటోను షేర్‌ చేసుకుంది. 

 కింగ్‌ ఖాన్‌ షారుక్‌ కూతురు సుహానా ఖాన్‌, కపూర్‌ ఫ్యామిలీకి చెందిన షనయా కపూర్‌తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనన్య పాండే.  తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో అనన్య దిగిన ఈ  ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోలో మధ్యలో ఉన్నదినటి అనన్య పాండే కాగా, ఆమె కుడివైపు షనయా కపూర్‌ ఉండగా, ఎడమ వైపు ఉన్నది సుహానా ఖాన్‌. వీరిద్దరితో  బెస్ట్‌ హోలీ మొమరీస్‌ ఉన్నాయని గుర్తు చేసుకుంది అనన్య.  ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరింది. 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

చదవండి : హోలీ సెలబ్రేషన్స్‌లో మన స్టార్స్.. ఫోటోలు వైరల్‌ 
సోషల్‌ హల్‌చల్‌: మేనుకు రంగులద్దుకున్న భామలు 

మరిన్ని వార్తలు