HCA Film Awards 2023: విశ్వ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తా.. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కినెట్టి..

25 Feb, 2023 12:01 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. గ్లోబల్‌ లెవల్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)’ అవార్డుల్లో ఏకంగా ఐదింటిని సొంతం చేసుకొని తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది.

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌,  ‘బెస్ట్‌ స్టంట్స్‌’, బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌(నాటు నాటు) ఇలా పలు విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అవార్డులు దక్కించుకుంది. బ్లాక్‌ పాంథర్‌, ది వుమెన్‌ కింగ్‌, ది బ్యాట్‌ మ్యాన్‌ వంటి హాలీవుడ్‌చిత్రాలను వెనక్కి నెట్టి ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ అవార్డులను దక్కించుకోవడం గమనార్హం.  ఈ అవార్డులను డైరెక్టర్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అందుకున్నారు.

అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌కు బెస్ట్‌ స్టంట్స్‌ అందించిన హెచ్‌సీఏకు థ్యాంక్స్‌.  నేను ముందుగా మా యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్ చెప్పాలి.  స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులలో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్ చేశారు. .ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియాకు వచ్చి మా విజన్ అర్థం చేసుకుని, మా వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకుని పని చేశారు.

 మా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు థాంక్స్. రెండు మూడు షాట్స్ లో మాత్రమే బాడీ డబుల్ ఉపయోగించాం.  మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు. ఈక్రెడిల్ అంతా మా టీమ్‌కే దక్కుతుంది.  ఇక మా ఇండియా ఎన్నో కథలకు నిలయం. భారత దేశం నుంచి అద్భుతమైన కథలు పుడతాయి. మేరా భారత్ మహాన్’అంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు