‘పవన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’

8 Sep, 2020 16:54 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించబోయే 27 వ సినిమాకు క్రిష్ జాగర్లపూడి ద‌ర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప‌వ‌న్ బ‌ర్త్‌డే(సెప్టెంబర్‌ 2) సంద‌ర్భంగా ద‌ర్శకుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా ప‌వ‌న్ 27వ సినిమా ప్రి లుక్‌ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. అప్పట్లో జరిగిన పదిహేను రోజుల‌ షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందంటూ.. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం నిర్మి‌స్తున్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (ప‌వ‌న్ 27: అభిమానుల‌కు మ‌రో ట్రీట్‌)

ఇక హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ బెన్‌లాక్‌ ఈ సినిమాకు (వీఎఫ్‌ఎక్స్‌)విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించనున్నారు. ఈ మేరకు ఆయన గత వారమే ట్విటర్‌లో స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్రిష్‌, పవన్‌ కల్యాణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక హాలీవుడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ దర్శకుడు ఈ సినిమాకు ఎంటర్‌ అవ్వడంతో మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయాయి. కాగా బెన్‌లాక్‌ తెలుగులో పనిచేయడం ఇదే తొలిసారి.  దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తూ.. బెన్‌లాక్‌కు ఆల్‌ దబెస్ట్‌ చెబుతున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని కోరుతున్నారు. (ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా