‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌ షూట్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌

3 Mar, 2021 10:16 IST|Sakshi

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌధ్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు స్వాతంత్ర్య సమరవీరులుగా నటిస్తున్న ఈ మూవీ అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటికి విడుదల చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌పై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. అదే రేంజ్‌లో మూవీ మేకింగ్‌ విషయంలో కూడా దర్శకధీరుడు వెనక్కి తగ్గడంలేదు. ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్‌ సీన్లతో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం రాజమౌళీ ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ను తీసుకువచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌ ఆయన రాజమౌళికి సన్నివేశాలను వివరిస్తున్న వీడియోను చిత్ర యూనిట్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

అయితే నిక్‌ పావెల్‌ కత్తియుద్ధంలో నిపుణుడు అనే విషయం తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ను రాజమౌళీ భారీగా ప్లాన్‌ చేశాడు, ఈ మూవీ చివర్లో కత్తి యుద్దాలు ఉండనున్నాయని అభిప్రాయపడుతున్నారు. నిక్ పావెల్ గతంలో బ్రిటన్ వూషూ టీమ్ తరపున యూరోపియన్ చాంపియన్ షిప్‌లో పతకం గెలుచుకున్నాడు. అనేక యుద్ధ విద్యలను అధ్యయనం చేసిన ఆయన హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ‘బ్రేవ్ హార్ట్’, ‘గ్లాడియేటర్‌’, ‘మమ్మీ ది లాస్ట్ సమురాయ్’, ‘సిండ్రెల్లా మ్యాన్’ వంటి చిత్రాలకు పోరాట సన్నివేశాలు రూపకల్పన చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఆయన. అలాగే బాలీవుడ్‌ హిస్టారికల్‌ చిత్రం మణికర్ణికలో కత్తి యుద్దాలు, స్టంట్స్‌కు ఆయనే రూపకల్పన చేశాడు. 

చదవండి: ‘ప్యాన్‌‌ ఇండియా’ను టార్గెట్‌ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ 
                ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్లో పవన్‌ కల్యాణ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు