హాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై కరోనా ఎఫెక్ట్‌

11 Apr, 2021 08:19 IST|Sakshi

హాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై కూడా కరోనా ఎఫెక్ట్‌ పడింది. దీంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన ‘టాప్‌ గన్‌: మ్యావరిక్‌’, ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’ చిత్రాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. 1986లో టామ్‌ క్రూజ్‌ నటించిన ‘టాప్‌ గన్‌’కు సీక్వెల్‌గా ‘టాప్‌ గన్‌: మ్యావరిక్‌’ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జూలై 2న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా వేశారు.

అలాగే ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’ చిత్రం 2022 నవంబరు 4 నుంచి 2023 జూలై 7కి వాయిదా పడింది. వీటితో పాటుగా ఈ ఏడాది జూలై 23న విడుదలకు షెడ్యూల్‌ అయిన ‘స్నేక్‌ ఐస్‌’ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 22కి పోస్ట్‌పోన్‌ అయ్యింది. వీటితో పాటు మరికొన్ని హాలీవుడ్‌ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే ఇండియన్‌ మూవీస్‌ రిలీజ్‌లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తాజాగా హాలీవుడ్‌ సినిమాలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఎంటైర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ కరోనా కారణంగా మరోసారి కుదేలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది. 

చదవండి: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్‌ షాక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు