విజయ్ దేవరకొండ‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌‌

7 Apr, 2021 10:36 IST|Sakshi

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ భామ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’. ఈ చిత్రాన్ని మాస్‌ దర్శకుడు పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్‌డేటస్‌ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్‌డేట్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ యాక్షన్‌ సీన్లతో రూపొందుతున్న ఈ మూవీ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

అంతేగాక నిర్మాత కరణ్‌ జోహార్‌, చార్మీలు సైతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మంగళవారం కరణ్ జోహార్‌ ట్వీట్ చేస్తూ.. ‘ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్, ఆయన టీమ్‌ను ‘లైగర్’ సినిమా కోసం ఎంపిక చేశామని మీతో చెప్పడానికి చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. గతంలో జాకీ చాన్ లాంటి ప్రముఖ నటులకు ఆయన కొరియోగ్రఫి అందించారు. అలాంటి ఆయన మా సినిమాకు పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు.

అంతేగాక ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీల ఫొటోను జత చేశాడు. ఇక హాలీవుడ్‌లో టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అండీ లాంగ్ అసలు పేరు ఆండ్రియాస్ నుయెన్. జాకీ ఛాన్ నటించిన ‘ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3’, ‘చైనీస్ జోడాయిక్’, ‘పోలీస్ స్టోరీ 2013’, ‘డ్రాగన్ బ్లేడ్’ చిత్రాలకు ఆయన పనిచేశారు. 2006లో ‘మ్యాగ్ ఫైటర్స్ అనే స్టంట్ టీమ్‌ను ప్రారంభించారు. కాగా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘లైగర్’‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతుంది. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు