కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్‌ప్రైజ్.. యువరాజ్‌ కుమార్ తెరంగేట్రం!

28 Apr, 2022 05:07 IST|Sakshi

కేజీఎఫ్‌ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్‌ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్‌ చాప్టర్‌-2 ఇటీవలే విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
కాగా తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించి హోంబలే ఫిలిమ్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్‌ కుమార్ మనవడు, దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు, యాక్ట‌ర్ రాఘ‌వేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్‌ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. యువరాజ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూ దానికి వార‌సత్వం కొన‌సాగుతుందని క్యాప్ష‌న్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్‌ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌బోతున్నాడు.

మరిన్ని వార్తలు