గజదొంగల నవ్వులు

28 Feb, 2021 05:59 IST|Sakshi

‘‘హౌస్‌ అరెస్ట్‌’ సినిమా స్టార్ట్‌ కావడానికి కారణం అనూప్‌ రూబెన్స్‌. చిన్నపిల్లల సినిమా ఫుల్‌ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్‌ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది’’ అని డైరెక్టర్‌ శేఖర్‌ రెడ్డి అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్‌ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్‌’ ఫేమ్‌ శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ అరెస్ట్‌’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, నిర్మాత అశోక్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్‌ అరెస్ట్‌’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్‌ అరెస్ట్‌’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్‌ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్‌ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్‌ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు