నా ట్యాక్స్‌లోంచి కంగ‌నకు భ‌ద్ర‌తా క‌ల్పించారా?

10 Sep, 2020 12:04 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌కు వై-ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌లిపించ‌డంపై న‌టి కుబ్రాసైథ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న ట్యాక్స్‌లోంచి వీటికి డ‌బ్బులు వెళ్ల‌డం లేదు క‌దా అంటూ విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌లపై కంగ‌నా సోద‌రి రంగోలి సైతం ధీటుగా స‌మాధాన‌మిచ్చారు. క్యురియాసిటీ (ఉత్సుక‌త‌)తో అడుగుతున్నా..ఇంత‌కీ ఎంత ట్యాక్స్ క‌డుతున్నారేంటి అంటూ చుర‌క‌లంటించారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఓ వ‌ర్గం కంగ‌నాకు మ‌ద్దుతుగా ఉంటే, మ‌రో వ‌ర్గం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ సాధార‌ణ న‌టికి వై- ప్ల‌స్ క్యాట‌గిరీ క‌ల్పించ‌డంపై రాజ‌కీయ కోణ‌మేదైనా ఉందా అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లోని 25 ప్ర‌ముఖ వ్య‌క్తుల‌కు డ్ర‌గ్స్‌తో సంబంధాలున్నాయ‌ని రియా పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. (మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా)

త‌ద‌నంత‌ర క‌స్ట‌డీ కోరుతూ ఎన్‌సీబీ రియాను అదుపులోకి తీసుకోవ‌డంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు జ‌స్టిస్ ఫ‌ర్ రియా అంటూ క్యాంపెయిన్ న‌డుపుతుండ‌టం గ‌మ‌నార్హం.ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్‌ కారణంగా సెప్టెంబర్‌ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్‌ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్‌ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలో కంగ‌నాకు ప్ర‌జ‌ల నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇండియా విత్ కంగ‌నా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ అభిమానులు కంగ‌నాకు బాస‌ట‌గా నిలిచారు. (ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా