సమంత కసరత్తు మాములుగా లేదుగా..!

7 Jun, 2021 21:52 IST|Sakshi

ఫ్యామిలీమ్యాన్‌-2తో తొలిసారిగా వెబ్‌ సిరీస్‌లోకి అరంగేట్రం చేసిన సమంత తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో పూర్తిగా పరాకాయ ప్రవేశం చేయగా, తన నటనతోనే కాకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీసిందనే చెప్పాలి. ఫ్యామిలీమెన్‌లో సమంత చేసిన పర్ఫార్మెన్స్‌కు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాగా రాజీ పాత్రలో సమంత చేసిన యాక్షన్‌ సీన్స్‌ వెబ్‌ సిరీస్‌కే హైలెట్‌గా నిలిచాయి.

వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో ఈ పాత్ర కోసం సమంత భారీగానే కసరత్తులు చేసింది. కాగా యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన ఓ ప్రాక్టిస్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. వెబ్‌ సిరీస్‌లో యాక్షన్‌ సన్నివేశాలు బాగా వచ్చేలా ట్రెయిన్‌ చేసిన స్టంట్‌ కో ఆర్డినేటర్‌ యానిక్ బెన్‌కు ప్రత్యేకంగా కృతజ‍్క్షతలను తెలిపింది.  అంతేకాకుండా తనకు హైట్స్‌ అంటే భయమైనా,  వెబ్‌ సిరీస్‌లో యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా  ఓ భవనం నుంచి దూకే సన్నివేశంలో నువ్వు ఉన్నావన్నా ధైర్యంతో  చేశానని తెలిపింది.

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

చదవండి: కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్‌ మొత్తం పోయాయి: నటి

మరిన్ని వార్తలు