Salaar Vs Fighter: ప్రభాస్‌ ‘సలార్‌’-‘హృతిక్‌’ ఫైటర్‌ ఢీకొట్టనున్నాయా?!

17 Aug, 2022 11:26 IST|Sakshi

దక్షిణాది ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్‌’. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందరి అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ ఆగస్ట్‌ 14న చిత్రం బృందం ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో​ రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపించాడు ప్రభాస్‌. ఈ పోస్టర్‌తో పాటు మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బాలీవుడ్‌ భారీ చిత్రం ఫైటర్‌ను కూడా అదే రోజున విడుదల చేస్తామని సలార్‌ మూవీ కంటే ముందే ప్రకటించారు. 

చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియన్‌ ఫస్ట్‌ ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హృతిక్‌ జోడిగా దీపికా పదుకొనె నటించనుండగా.. అగ్ర నటుడు అనిల్‌ కపూర్‌ కీ రోల్‌ పోషించనున్నాడు. అంతేకాదు ప్రముఖ హాలీవుడ్‌ యాక్టర్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రెండు భారీ యాక్షన్‌ చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీసు వద్ద తలపడితే? ఎలా అని అందరిలో ఆసక్తినెలకొంది. దీంతో ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదని, భారతీయ సైనిక వీరత్వాన్ని చాటిచెప్పే విధంగా అంత్యంత ప్రతిష్టాత్మగా ఫైటర్‌ను హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీస్తానని డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ చెప్పాడు.

చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార

అంతేకాదు ఈ సినిమాను సెప్టెంబర్‌ నెలాఖరున రిలీజ్‌ చేస్తానని చెప్పడం, ఇప్పుడు సలార్‌ మూవీ రిలీజ్‌ అప్పుడే ఉండటంతో ఈ రెండు చిత్రాలు ఒకవేళ ఢీ కొంటే? దేని ఫలితం ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సలార్‌ బడ్జెట్‌ రూ. 200 కోట్లు కాగా.. ఫైటర్‌ను రూ. 250 కోట్లు. ఫైటర్‌ బడ్జెట్‌ ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చెప్పాడు. అయితే ఇప్పటికీ ఈ మూవీ సంబంధించిన ఎలాంటి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయకపోవడం గమనార్హం. ఇప్పటికి ఇంకా సెట్స్‌పైకి రానీ ఫైటర్‌ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు తలపడితే ఏది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది.. మరి డార్లింగ్‌ కోసం హృతిక్‌ వెనక్కి తగ్గుతాడా? లేదా చూడాలి.  

మరిన్ని వార్తలు