హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి చస్తా అనుకున్న

25 May, 2021 17:53 IST|Sakshi

షూటింగ్‌ జ్ఞాపకాలు పంచుకున్న అభయ్‌ డియోల్‌

ముంబై: షూటింగ్‌ సమయంలో హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి తన పై ప్రాణాలు పైనే పోయాయంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అభయ్‌ డియోల్‌. కొన్ని క్షణాల పాటు మృత్యుదేవత నా కళ్ల ముందే కనిపించిందని, అయితే అదృష్టం బాగుండటంతో ప్రాణాలు దక్కాయంటూ జిందగి నామిలేంగే దొబారా సినిమా షూటింగ్‌ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. 
లోయలోకి కారు
జోయా అక్తర్‌ దర్శకత్వంలో హృతిక​ రోషన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అభయ్‌ డియోల్‌లు కలిసి నటించిన జిందగి నామిలేంగే దొబారా చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సంరద్భంగా అభయ్‌ ఆ నాటి విషయాలు చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగేప్పుడు హృతిక్‌ కారు డ్రైవ్‌ చేస్తుంటే తాను, ఫర్హాన్‌ అక్తర్‌ కారు వెనుకు సీట్లో కూర్చున్నామని.. అయితే ఏటవాలుగా ఉన్న ప్రాంతం ప్రయాణించేప్పుడు, సడన్‌గా కారును ఆపి హృతిక్‌రోషన్‌ బయటకు వెళ్లాడని చెప్పారు. అయితే ఆ సమయంలో కారు హ్యాండ్‌బ్రేక్‌ వేయడం హృతిక్‌ మరచిపోయాడని.. దాంతో కారు నెమ్మదిగా లోయలోకి వెళ్లడం ప్రారంభించిందన్నారు. వెంటనే అలెర్టయిన ఫర్హాన్‌ కారు దిగేందుకు రెడీగా అయ్యాడని, తనకేమో మెదడు మొద్దుబారిపోయి సీటులో అలానే కదలకుండా కూర్చున్నట్టు అభయ్‌ చెప్పాడు.  

బ్రేక్‌ వేసిన హృతిక్‌
కారులోయలో పడుతుందని.. ఇక తనకు చావు తప్పదని ఫిక్స్‌ అయిన టైంలో పొరపాటు గ్రహించిన హృతిక్‌, వెంటనే వెనక్కి వచ్చిబ్రేక్‌ వేయడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఆనాటి ఘటనను వివరించారు అభయ్‌. ప్రేక్షకులను రంజిప చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతుంటామని చెప్పాడు అభయ్‌

మరిన్ని వార్తలు