Hrithik Roshan: ప్రియురాలిపై పొగడ్తలు కురిపించిన హృతిక్‌ రోషన్‌

8 Mar, 2022 16:43 IST|Sakshi

బాలీవుడ్‌ అందగాడు హృతిక్‌ రోషన్‌, హీరోయిన్‌, సింగర్‌ సబా ఆజాద్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఇద్దరూ కలిసి డిన్నర్‌కు బయటకు వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో డేటింగ్‌ నిజమేనంటున్నారు నెటిజన్లు. అంతెందుకు, ఈ మధ్య ఏకంగా హీరో ఇంటికే భోజనానికి వెళ్లింది సబా. ఇదిలా ఉంటే తాజాగా సబాపై పొగడ్తల వర్షం కురిపించాడు హృతిక్‌.

సబా ఆజాద్‌ తాను పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 'అస్వస్థతో ఇంట్లో ఉన్న నాకు పాడటం తప్ప ఇంకేం చేయలేను అనిపించింది. నా చిన్నతనంలో పేరెంట్స్‌ గూపీ జిన్‌ బఘ బైన్‌ అనే సినిమా పాటల క్యాసెట్‌ టేప్‌ తెచ్చారు. నాకు బంగ్లా అర్థం కాదు, కానీ సినిమా చూసి చాలా ఆనందించాం. అది నా ఫేవరెట్‌ క్యాసెట్‌గా మారిపోయింది. నాకు ఆ పాటల్లోని ఒక్క పదానికి కూడా అర్థం తెలియకపోయినా అన్నింటిని నేర్చేసుకున్నాను. అదే సంగీతం గొప్పతనం, సంగీతానికి భాషతో సంబంధం లేదు. కొంతకాలం క్రితం ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్నప్పుడు పాటలు పాడుకున్నాం. నాకింకా అన్ని లిరిక్స్‌ గుర్తున్నాయని నాకప్పుడే అర్థమైంది. అందులో నాకు చాలా ఇష్టమైన పాటను మీకోసం పాడుతున్నాను. కాస్త ధైర్యం వస్తే మిగతా అన్నింటినీ పాడుతాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై హృతిక్‌ స్పందిస్తూ నువ్వు అద్భుతమైన వ్యక్తివి అని ప్రశంసించాడు.

A post shared by Saba Azad (@sabazad)

మరిన్ని వార్తలు