హృతిక్‌ ఇంటి విలువ ఎంతో తెలుసా!

25 Oct, 2020 12:47 IST|Sakshi

టముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్ ముంబైలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంట్‌ల‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అపార్టుమెంట్‌ డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌజ్‌ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్‌ ఇన్‌ ది ఎయిర్‌ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్‌ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి 10 పార్కింగ్‌ స్థలాలను కేటాయించి ఉంటుందంట. (చదవండి: ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్)

డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్ కోసం హృతిక్‌ రూ .67.5 కోట్లు, 11165 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14వ అంతస్తు అపార్ట్‌మెంట్‌ కోసం రూ. 30 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌లో హృతిక్‌ సముద్ర ముఖం ఉన్న ఈ ఇంటి ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉన్నాడు. దాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనంలో విలాసవంతమైన 4 పడక గదులు, ఒక హాలు, కిచెన్‌ ఉంది.  దీనిని ఇంటీరియర్ డిజైనర్ అశీష్ షా ఒక డెన్, రెండు బెడ్‌ రూమ్‌లుగా విభజించారు. అలాగే ఇందులో ఒక ఫుట్‌బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, బిలియర్డ్స్ టేబుల్‌తో పాటు చాక్లెట్‌ వెండింగ్ మెషీన్‌ కూడా ఉంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు