Hrithik Roshan Zomato Ad: పాపం హిందీ హీరోలు!.. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్‌

21 Aug, 2022 16:37 IST|Sakshi

Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్‌ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ అంటూ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్‌ చద్దా', అక్షయ్‌ కుమార్‌ 'రక్షా బంధన్‌', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. 

విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్‌కాట్‌ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌ చిత్రం 'విక్రమ్‌-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్‌ చేసిన పనితో ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్‌ రోషన్‌ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్‌ డెలీవరి యాప్ జొమాటో యాడ్‌లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్‌ హృతిక్ రోషన్‌తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్‌లో హృతిక్‌ చెప్పిన డైలాగ్‌లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. 

చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా?

ఈ యాడ్‌లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్‌ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్‌ నుంచి తాలీ ఆర్డర్‌ చేశా' అని హృతిక్‌ రోషన్‌ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు.  అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్‌ను చూపించలేదు. 

చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్‌ హీరో.. కష్టాలతో జీవితం

మహాకాల్‌ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్‌గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్‌ రోషన్‌ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు 'బాయ్‌కాట్‌ జొమాటో' అని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్‌పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్‌ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్‌ చేశారు. 

చదవండి: ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు

ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్‌ రెస్టారెంట్‌లను ప్రమోట్‌ చేసే పాన్‌ ఇండియా క్యాంపెయిన్‌లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్‌ రెస్టారెంట్‌ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్‌ ఐటమ్‌ కూడా ఉంది. ఆ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్‌ చేసుకుంటారు' అని ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది జొమాటో.  ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్‌ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్‌ రోషన్‌ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. 

చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్

మరిన్ని వార్తలు