మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం

27 Feb, 2023 23:31 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం జరిగింది మాత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సినిమా సెట్‌లో కాదు. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార‍్య సినిమా సెట్‌. ఆ చిత్రం కోసం అప్పట్లో హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద ఓ భారీ సెట్ నిర్మించారు.

అయితే ఇప్పటి వరకు ఆ సెట్‌ను అలానే ఉంచారు. కాగా నేడు ఆ చిత్రానికి ఎంతో కీలకమైన ధర్మస్థలి టెంపుల్ సెట్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు గమనించి దగ్గరలోని వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

దాంతో ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. ఇక మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉంది. ఆచార‍్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కలసి నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు