ముమైత్‌ ఖాన్‌ మోసం చేసింది: క్యాబ్‌ డ్రైవర్‌

29 Sep, 2020 16:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి ముమైత్ ఖాన్‌ డబ్బులు ఎగ్గొట్టిందని ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్‌లో గోవా టూర్‌ వెళ్లొచ్చిన ముమైత్‌ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్‌.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామొడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని అన్నాడు. ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.


(చదవండి: నా బలం నాకు తెలుసు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా