మోటరు బోటు కొనాలనుకుంటున్నా: బ్రహ్మాజీ

19 Oct, 2020 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం జలమయమైంది. మహానగరంలోని రోడ్లు, వీధులు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వరదలపై సోషల్‌ మీడియాల్లో నెటిజన్‌లు ఫన్నీ మీమ్స్ క్రియోట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. అదే విధంగా సినీ నటుడు బ్రహ్మాజీ కూడా హైదరాబాద్‌ వరదలపై తనదైన శైలిలో స్పందించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయన ఇంటిలోకి నీరు చేరిన ఫొటోలను సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘ఇది మా ఇంటి పరిస్థితి..  ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్న... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి తెలపండి’ అంటూ చమత్కరించాడు. (చదవండి: భారీ వరదలు : ఇంటికి లక్ష సాయం)

ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో వందలాది కాలనీలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. నీటిలో చిక్కుకున్న వారికి పడవల ద్వారా సహాయక చర్యలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి: మూసీ వరద: కుంగిన 400 ఏళ్ల నాటి వంతెన)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు