హైదరాబాద్‌ వరదలు: నాగార్జున విరాళం

20 Oct, 2020 14:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సినీ హీరో నాగార్జున అక్కినేని స్పందిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేగాక సీఎం సహాయ నిధికి తన వంతు సాయాన్ని ప్రకటిస్తూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. (చదవండి: సిటీలో మళ్లీ వాన: ప్రజలకు హెచ్చరిక)

‘ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేయడాన్ని అభినందిస్తున్న. బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అదే విధంగా నావంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అంతేగాక వరద బాధితులను ఆదుకునేందుకు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. నిన్న(సోమవారం) తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించగా.. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా సీఎం సహాయ నిధికి రూ. 15 కోట్లు ప్రకటించారు. (చదవండి: తెలంగాణకు రూ.15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం)

మరిన్ని వార్తలు