బిగ్‌బాస్‌ ఫేం సొహైల్‌కు రైజింగ్‌ స్టార్‌ అవార్డు

21 Jun, 2021 11:36 IST|Sakshi
సొహైల్‌కు రైజింగ్‌ స్టార్‌ అవార్డును అందజేస్తున్న లయన్‌ కేవీ.రమణారావు, లలితారావు  

సాక్షి, కాచిగూడ: నటుడిగా పలు టీవీ ధారావాహికలు, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సయ్యద్‌ సొహైల్‌ రియాన్‌ బిగ్‌బాస్‌ సీజన్‌–4 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్‌బాస్‌ ద్వారా బహుమతిగా తనకు లభించిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథ అశ్రమాలకు అందజేశారు. “సోహి హెల్పింగ్‌ హాండ్స్‌’ స్థాపించి తద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు ఆర్థిక సాయంతో పాటు, నిత్యావసర సరుకులను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సొహైల్‌ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రైజింగ్‌ స్టార్‌ అవార్డుతో ఆదివారం సత్కరించారు.

ఈ సందర్భంగా సొహైల్‌ మాట్లాడుతూ.. నటుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తృప్తితో పాటు నేను స్థాపించిన సోహి హెలి్పంగ్‌ హాండ్స్‌ ద్వారా తాను సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగిస్తూ తద్వారా ఎంతో మానసిక ఆనందం పొందుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షురాలు లయన్‌ లలితారావు, ఏబీసీ ఫౌండేషన్‌ అధ్యక్షులు లయన్‌ కె.వి.రమణారావు, అన్నమాచార్య ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షులు అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 
అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్‌ చంపేస్తా.. అంటూ

ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్‌

మరిన్ని వార్తలు