ఎన్టీఆర్‌ దూకుడు, వెనకబడ్డ అల్లు అర్జున్‌!

2 Jun, 2021 14:32 IST|Sakshi

హైదరాబాద్‌ టైమ్స్‌ ప్రతి యేటా ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ జాబితాలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ మరోసారి మొదటి స్థానంలో నిలిచాడు. వరుసగా మూడోసారి విజయ్‌ తన మొదటి ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని గతేడాది మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకోగా ఈసారి మాత్రం రెండో స్థానానికి ఎగబాకాడు. 2019లో 19వ ర్యాంకులో ఉన్న యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈసారి మాత్రం ఏకంగా మూడో స్థానంలోకి దూసుకురావడం కొసమెరుపు.

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గతంలోకన్నా రెండు స్థానాలు దిగజారి నాలుగో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. తొలిసారి మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ జాబితాలో చోటు దక్కించుకున్న నాగశౌర్య ఐదవ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది 12వ స్థానంలో ఉన్న అల్లు అర్జున్‌ ఈసారి 16వ స్థానానికి పడిపోయాడు. బిగ్‌బాస్‌​ కంటెస్టెంట్‌ అఖిల్‌ సార్థక్‌ 14వ స్థానం సంపాదించుకున్నాడు. సినిమా సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్‌, సిరాజ్‌ కూడా ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నారు. 

హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ ఆఫ్‌ 2020 ర్యాంకులివే..
1. విజయ్‌ దేవరకొండ
2. రామ్‌ పోతినేని
3. జూనియర్‌ ఎన్టీఆర్‌
4. రామ్‌చరణ్‌
5. నాగశౌర్య
6. నాగచైతన్య
7.ముస్తఫా దావూద్‌
8. సల్మాన్‌ జైదీ
9. సందీప్‌ కిషన్‌
10. నవదీప్‌
11. రానా దగ్గుబాటి
12. సిద్ధు జొన్నలగడ్డ
13. మొహమ్మద్‌ సిరాజ్‌
14. అఖిల్‌ సార్థక్‌
15. సుధీర్‌ బాబు
16. అల్లు అర్జున్‌
17. వరుణ్‌ తేజ్‌
18. బషీర్‌ అలీ
19. కార్తికేయ
20. అఖిల్‌ అక్కినేని
21. ఆనంద్‌ దేవరకొండ
22. అడివి శేష్‌
23. శ్రవణ్‌ రెడ్డి
24. విశ్వక్‌ సేన్‌
25. నితిన్‌
26. నాని
27. ఆది పినిశెట్టి
28.కిదాంబి శ్రీకాంత్‌
29. ప్రణవ్‌ చాగంటి
30. తరుణ్‌ భాస్కర్‌

చదవండి: దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తిక విషయాలు చెప్పిన ఆయన తండ్రి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు